Prema ane mayalo song lyrics | ప్రేమా అనే మాయలో

 


ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి

కన్న వారి కలలకు దూరమై

కష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా||


1.తల్లిదండ్రులు కలలు గని

రెక్కలు ముక్కలు చేసుకొని (2)

రక్తము చెమటగా మార్చుకొని

నీ పైన ఆశలు పెట్టుకొని

నిన్ను చదివిస్తే - పట్టణం పంపిస్తే

ప్రేమకు లోబడి - బ్రతుకులో నీవు చెడి – (2)

||కన్న||


2.ప్రభు ప్రేమను వదులుకొని

ఈ లోక ఆశలు హత్తుకొని (2)

యేసయ్య క్షమను వలదని

దేవుని పిలుపును కాదని

నీవు జీవిస్తే - తనువు చాలిస్తే

నరకము చేరుకొని - అగ్నిలో కూరుకొని – (2)

కొన్న తండ్రి కలలకు దూరమై

కష్టాల కోడలికి చేరువై (2) || ప్రేమా||


* Telugu Christian songs lyrics index






Comments

Popular posts from this blog

Mahonnathuda mahaganuda song lyrics | మహోన్నతుడా మహా ఘనుడా

Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి

Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా