Posts

Showing posts from May, 2022

Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా

Image
సన్నుతించుమా సంగమా - కీర్తింతుమా కుటుంబమా ||2|| ప్రస్తుతింతుమా ప్రపంచమా - పొంగిపొరలుమా పరలోకమా ||2|| ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును||2|| ||సన్నుతించుమా || 1. కడబూర వినబడున్ - ప్రభు యేసు కనబడన్ ||2|| సమాధులు తెరవబడున్ - పరిశుద్ధులు లేపబడున్ ||2|| ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును ||2|| ||సన్నుతించుమా|| 2. పరిశుద్ధులంతా చేరుకొనున్ - పరలోక విందులో పాల్గొనున్ ||2|| ప్రభు యేసే జీవహారమగుణ - పరలోకమంత ఉప్పొంగున్ ||2|| ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును ||2|| ||సన్నుతించుమా||

yesayya nee bhavalu song lyrics in telugu - యేసయ్యానీ భావాలు

Image
  యేసయ్యానీ భావాలు నా యెదలోనే నిండాలి ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి (2) 1.కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి నీ కరుణ మార్గములో నేను నడవాలి నీ జీవజలములనే నేను సేవించాలి 2.నీ మెల్లని స్వరము నాకు వినిపించాలి నీ ఆత్మ ఫలములను నేను ఫలియించాలి రూపాంతరనుభవము నేను పొందాలి నీ మహిమ రూపమునే నేను చూడాలి